జంతువులకు కూడా గుండె ఉంటుంది..కానీ గుండెపోటు మనుషులకే ఎందుకు..?

-

ప్రాణం ఉన్న ప్రతి జీవికి గుండె ఉంటుంది.. అది ఆగిన రోజు ప్రాణం పోతుంది.. చనిపోతారు. అయితే..గుండెపోటు మాత్రం మనిషికే వస్తుంది.. ఈరోజుల్లో గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఏజ్‌తో సంబంధం లేకుండా అందరికీ వచ్చేస్తుంది. గుండె అందరికీ ఉన్నప్పుడు గుండెపోటు మాత్రం కేవలం మనుషులకే ఎందుకు వస్తుంది. జంతువులకు, పక్షులకు ఎందుకు రావడం లేదు..? ఈ డౌట్‌ మీకు కూడా ఎప్పుడైనా వచ్చిందా..?
శాస్త్రవేత్తలు ఈ అంశంపై పరిశోధన చేసి..కొన్ని విషయాలను చెప్పారు.. జంతువుల్లో ఉండి, మనలో లేని ఒక జన్యువే దీనికి కారణమని చెబుతున్నారు. ఆ జన్యువు పేరు ‘సీఎంఏహెచ్’. ఇది రెండు లక్షల ఏళ్ల క్రితం వరకు మనుషుల్లో ఈ జన్యువు ఉండేదట… తరువాత నశించి పోయింది. ఇది లేకపోవడం వల్లే మనకు గుండెపోటు వస్తోందనేది పరిశోధకులు అంటున్నారు.
పదిహేనేళ్ల క్రితం చింపాంజీలు, ఇతర క్షీరదాలకు కూడా గుండెపోటు సాధారణంగా వచ్చే అవకాశం ఉందేమో తెలుసుకునేందుకు కూడా శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. అందులో దాదాపు వచ్చే అవకాశం లేదనే తేలింది. నిజానికి చింపాంజీలకు మనుషులకంటే ఎక్కువ బద్ధకం. వాటిల్లో కూడా కొవ్వు పేరుకుపోతుంది అయినా గుండెకు మాత్రం ఏ సమస్యా ఉండదు.. ఎందుకంటే.. వీటిలో ఆ జన్యువు ఇంకా ఉంది కాబట్టి…
ఎలుకల్లో కూడా ఈ జన్యువు ఉంది. కొన్ని ఎలుకల్లో ఈ జన్యువును నిర్వీర్యం చేసి, కొన్ని ఎలుకల్లో ఉంచి పరిశోధన చేశారు. ఏ ఎలుకల్లో అయితే ‘సీఎంఏహెచ్’ జన్యువును నిర్వీర్యం చేశారో వాటిలో కొవ్వు శరీరంలో పేరుకుపోయి గుండె సమస్యలు రావడం మొదలయ్యాయట..సీఎంఏహెచ్ నిర్వీర్యమైతే గుండె పోటు ముప్పును పెంచుతుందని క్లియర్‌గా తెలిసింది. అలాగే మాంసాహారం తినేవారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువని కూడా ఈ పరిశోధనలో తేలింది.
సీఎంఏహెచ్ జన్యువు ఎప్పుడు, ఎందుకు మానవుల శరీరం నుంచి నిర్వీర్యమైపోయిందో శాస్త్రవేత్తలు తెలుసుకోలేకపోయారు..అది నిర్వీర్యం కాకుండా ఇప్పటికీ ఉంటే గుండె జబ్బులంటే ఏంటో, గుండె పోటు అంటే ఏంటో కూడా మనకు తెలిసేది కాదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న దాని ప్రకారం.. 70 ఏళ్లలోపు ఎక్కువ మంది గుండె జబ్బులతో మరణిస్తున్నట్టు తెలిసింది..ఇకపై ఏటా గుండెపోటు లేదా గుండె జబ్బులతో మరణించే వారి సంఖ్య పెరుగుతుందే కానీ..తగ్గే ఛాన్సే లేదు..
ఒకవేళ ఏదైనా పరిశోధన చేసి..ఆ జన్యువును టీకా రూపంలో మనుషులకు ఇస్తే.. ప్రపంచంలో సగం మరణాలు ఆగిపోతాయి.. కానీ అలా జరుగుతుందా..?

Read more RELATED
Recommended to you

Latest news