తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో మరో 13 డయాగ్నోస్టిక్ సెంటర్లు

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. తెలంగాణ డయాగ్నొస్టిక్స్ పథకాన్ని అన్ని జిల్లాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 20 జిల్లాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం మరో 13 చోట్ల నెల కొల్పేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది తెలంగాణ సర్కార్.

ఇవి కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో ఎనిమిది వైరాలజీ ప్రయోగశాలను కూడా ఏర్పాటు చేయాలని కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏకంగా 96 కోట్ల రూపాయలను విడుదల చేసింది. టెస్టింగ్ సెంటర్ లో 56 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారు.

మొదట నాలుగేళ్ల కిందట హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఆవరణలో తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో పూర్తి స్థాయిలో వాటంతటవే పరీక్షలు నిర్వహించి… ఫలితాలను వెల్లడించే అధునాతన పరికరాలను కూడా తీసుకు వచ్చింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో 13 తెలంగాణ డయాగ్నొస్టిక్ కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్.

Read more RELATED
Recommended to you

Latest news