రేవంత్ స్ట్రాటజీ రివర్స్ అవుతుందా? రెండో ప్లేస్ రీచ్ అవుతారా?

-

తెలంగాణలో రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. మొన్నటివరకు అధికార టీఆర్ఎస్‌కు తిరుగులేదని అంతా అనుకున్నారు…కానీ ఊహించని విధంగా బీజీపీ ముందు రేసులోకి వచ్చింది. అలాగే కొన్ని విజయాలతో టీఆర్ఎస్‌కు పోటీ వచ్చింది…దుబ్బాక, జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల తర్వాత బీజీపీనే టీఆర్ఎస్‌కు పోటీ ఇచ్చేదని అంతా అనుకున్నారు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

కానీ వాస్తవ పరిస్తితులు అందుకు విరుద్ధంగానే ఉన్నాయని చెప్పాలి..కాంగ్రెస్ వీక్‌గా కనిపిస్తున్నా సరే బీజేపీ కంటే బెటర్ గానే ఉందని అర్ధమైంది. ఎందుకంటే కాంగ్రెస్‌కు కింది స్థాయి నుంచి బలం ఉంది…కానీ బీజేపీకి కేవలం నాయకుల బలమే ఉంది. అందుకే టి‌పి‌సి‌సి పగ్గాలు రేవంత్ రెడ్డి చేపట్టాక కాంగ్రెస్‌లో ఊహించని మార్పు వచ్చింది. రేవంత్ దూకుడుతో కాంగ్రెస్ రేసులోకి వచ్చింది. ఇంకా బీజేపీకి థర్డ్ ప్లేస్ అనే పరిస్తితి వచ్చింది.

ఇలాంటి పరిస్తితుల్లో టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళి హుజూరాబాద్ బరిలో మళ్ళీ గెలిచిన ఈటల రాజేందర్‌తో రాజకీయం మరోసారి మారిపోయింది. ఈటల గెలుపుతో బీజేపీలో కొత్త ఊపు వచ్చింది. కేసీఆర్‌కు చెక్ పెట్టడానికి బీజేపీకి ఈటల రూపంలో ఒక నాయకుడు దొరికాడని అర్ధమైంది. ఇదే సమయంలో కేసీఆర్ రాజకీయం మార్చేశారు. ఆయనే స్వయంగా రంగంలోకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టార్గెట్‌గా ఫైర్ అవ్వడం మొదలుపెట్టారు. అంటే ఈటల పేరుని సైడ్ చేసి బండిని హైలైట్ చేశారు. దీని వెనుక కూడా రాజకీయం ఉందని తెలుస్తోంది.

అయితే ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు నడుస్తోంది. ఇక హుజూరాబాద్ ఎన్నిక తర్వాత రేవంత్ కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది..పైగా కాంగ్రెస్‌లో లుకలుకలు పెరిగాయి. ఇలాంటి పరిస్తితుల్లో రేవంత్ ఎంతవరకు పార్టీని ఎంతవరకు పైకి లేపుతారనేది క్లారిటీ లేదు. పైగా యథావిధిగా టీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటే అని అంటున్నారు. కానీ ఈ స్ట్రాటజీ అంతగా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. ఇప్పుడున్న పరిస్తితుల్లో రేవంత్, కాంగ్రెస్‌ని కనీసం రెండో పొజిషన్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి..ఆ తర్వాత అధికారం దిశగా ముందుకెళ్లాలి.

Read more RELATED
Recommended to you

Latest news