భీమ్లా నాయక్ నుంచి మరో బిగ్ అప్డేట్

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరియు హీరో దగ్గుబాటి రానాతో కలిసి మల్టీస్టారర్‌ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళం లో సూపర్‌ హిట్‌ అయిన… అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ సినిమాను పవన్‌ తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. సాగర్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే.. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయింది.

ఈ నేపథ్యంలోనే.. ఈ సినిమా “భీమ్లా నాయక్ ” టైటిల్ ను ప్రకటించి పవన్ ఫాన్స్ లో ఊపు తెప్పించింది. అయితే భీమ్లా నాయక్ సినిమా నుంచి… తాజాగా మరో అప్డేట్ రాబోతోంది. “ఇప్పటి వరకు పవర్ తుఫాను చూశారు. ఇప్పుడు గెట్ రెడీ ఫర్…. ఇవాళ సాయంత్రం 04;05 గంటలకు సిద్ధంగా ఉండండి” అంటూ భీమ్లా నాయక్.. సినిమా నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ స్పష్టం చేసింది. కాగా ఇంతవరకూ హీరో రానా కు సంబంధించి ఒక అప్డేట్ కూడా రాలేదు. దీన్నిబట్టి ఈ రోజు రానా గురించి అప్డేట్ వస్తుందని అందరూ అనుకుంటున్నారు. దీనిపై ఇవాళ సాయంత్రం క్లారిటీ రానుంది.