వాట్సాప్ నుండి మరో ఫీచర్.. ఒకే నెంబర్‌ తో ఒకే సారి రెండు స్మార్ట్‌ఫోన్లతో…!

చాలా మంది వాట్సాప్ ని ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ తో మనం ఎన్నో సేవలని పొందొచ్చు. పైగా ఎప్పటికప్పుడు వాట్సాప్ కొత్త ఫీచర్స్ ని కూడా తీసుకు వస్తుంది. ఇదిలా వుండగా తాజాగా మరో అద్భుతమైన ఫీచర్‌ను తీసుకు వచ్చింది.

ఇక మరి ఈ ఫీచర్ కి సంబంధించి పూర్తి వివరాలను చూస్తే.. వాట్సాప్ ఒకే నంబర్‌ తో ఒకే సారి రెండు స్మార్ట్‌ ఫోన్ల తో పాటుగా మరో రెండు డివైస్‌లలో వాట్సాప్‌ను యాక్సెస్‌ చేసుకోవడానికి ఓ ఫీచర్ ని తెచ్చింది. ఈ సేవను ఎనేబుల్ చేసేలా ‘కంపానియన్ మోడ్’ ని ప్రవేశ పెట్టింది. ఈ మోడ్ ని కొన్ని బీటా టెస్టర్‌లకు విడుదల చేసింది. ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

అలానే మొబైల్, డెస్క్‌టాప్‌లో ఏకకాలంలో వాట్సాప్‌ను వాడచ్చుట. అంతే కాక ‘లింక్ డివైస్’ ఆప్షన్ ద్వారా రెండో స్మార్ట్‌ ఫోన్‌ను లింక్ చేసుకోవచ్చు. పైగా ఇంకో స్మార్ట్‌ ఫోన్‌ను లింక్ చేసిన తర్వాత చాట్ హిస్టరీ చూడటం తో పాటు, మెసేజేస్‌ చూసుకోవడం, రిప్లై ఇవ్వడం చెయ్యచ్చు. అలానే కాల్స్‌ ని కూడా చేసుకోవచ్చు. అయితే బీటా టెస్టర్ మాక్సిమం 4 పరికరాలను రెండు స్మార్ట్‌ఫోన్‌లు, ఒక టాబ్లెట్ , ఒక డెస్క్‌టాప్‌కి మనం లింక్ చెయ్యచ్చుట.