శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌.. మరో ఫుడ్ కౌంటర్ ఓపెన్‌

-

తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. భక్తుల కోసం తాజాగా మరో ఫుడ్‌ కౌంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమలలో ప్రస్తుతం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంతో పాటు పాత అన్నదానం కాంప్లెక్స్‌, పీఎసీ-2లో అన్నప్రసాద వితరణ జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వీటి సరసన మరో ఫుడ్‌ కౌంటర్‌ను అదివారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. టీటీడీ భైర్మన్‌ వైవి. సుబ్బారెడ్డి ఆదేశాల మేరకే పీఎసీ-1 వద్ద కొత్త ఫుడ్‌ కౌంటర్‌ను ప్రారంభించారు.

ప్రతిరోజు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తారు. పీఏసీ-1లో బస చేసే సామాన్య భక్తులకు ఈ ఫుడ్ కౌంటర్ సౌకర్యవంతంగా ఉంటుందని వెల్లడించారు. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంతో పాటు పాత అన్నదానం కాంప్లెక్స్, పీఎసీ-2లో అన్నప్రసాద వితరణ జరుగుతోంది. వీటితోపాటు రాంభగీచా బస్టాండ్, కేంద్రీయ విచారణ కార్యాలయం వద్ద ఫుడ్ కౌంటర్లు ఉన్నాయి. దీంతో కలిపి మొత్తం ఫుడ్ కౌంటర్లు మూడుకు చేరాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news