ఓ యువకుడు ఇద్దరు కానిస్టేబుల్స్..గుంటూరులో మరో యువతి బలి…!

-

ముందు ప్రేమలో పాడేస్తారు ఆపై కోరిక తీర్చుకుంటారు అలాంటి సమయంలో ఫోటోలు వీడియోలు తీస్తారు. కోరిక తీరాకా ప్రేమా లేదు దోమా లేదు పొమ్మంటారు. వారు అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఫోటోలను విడియోలను ఆన్ లైన్ లో పెడతామని బ్లాక్ మెయిల్ చేస్తారు ఈ మధ్య ఏపీ లో ఇటువంటి కేసులు బాగా ఎక్కువైపోతున్నాయి. తాజాగా రాష్ట్రంలో గుంటూరు లోని ఓ బీటెక్ విద్యార్థిని న్యూడ్ ఫోటోలను పోర్న్ సైట్ లో అప్ లోడ్ చేసి రచ్చరచ్చ చేశారు ఆ ఘటన మరువక ముందే ఇప్పుడు అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది.

another girl from ap being blackmailed a guy and two constables
another girl from ap being blackmailed a guy and two constables

ఈ ఘటన నర్సారావుపేటలో జరిగింది. నర్సారావు పేటకు చెందిన బీటెక్ విద్యార్థిని తనను ఓ యువకుడు ప్రేమలో పడేశాడని ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చెప్పింది. ప్రేమ పేరుతో ఆ యువతిని మోసం చేసి తన న్యూడ్ ఫోటోలు వీడియోలు తీశాడు. ఇప్పుడు ఆ ఫోటోలను విడియోలను ఆన్ లైన్ లో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. తన ఫోటోలను ఎక్కడ ఆన్ లైన్ లో పెడతాడో అనే భయంతో ఆమె ఇప్పటికే 2 లక్షల నగదును రెండు బంగారు గాజులను ఆ మూర్ఖుడికి ఇచ్చింది. కానీ అవి సరిపోక ఇంకా డబ్బు కావాలని వేధించాడు. ఆ మూర్ఖుడికి అండగా ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా ఉన్నారని ఆమె అంటుంది. దాంతో ఆ యువతి ఏం చేయాలో అర్థం కాక గుంటూరు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఆ యువకుడి నుండి ఆ కానిస్టేబుల్స్ నుండి తనని రక్షించమని ఎస్పీ ని కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news