యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మీకు అందజేసిన ప్రింటెడ్ ఆధార్ కార్డును పోగొట్టుకున్నారా ? ఆ కార్డు కనిపించడం లేదా ? అయితే దిగులు చెందకండి. మీ ఆధార్ కార్డును ప్రింట్ రూపంలో మళ్లీ పొందవచ్చు. అవును.. UIDAI వెబ్‌సైట్ నుంచే మీ ఆధార్ కార్డును ప్రింట్ రూపంలో కావాలని కోరుతూ ఆర్డర్ పెట్టవచ్చు. దీంతో 15 రోజుల్లో కార్డును మీ ఇంటికే స్పీడ్ పోస్టు ద్వారా డెలివరీ అవుతుంది. అయితే అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆధార్ కార్డును ప్రింట్ రూపంలో పొందేందుకు ఇలా చేయండి…
1. ఆధార్ అధికారిక వెబ్‌సైట్ https://resident.uidai.gov.in/aadhaar-reprint లేదా ఫోన్‌లో mAadhaar App ను ఓపెన్ చేయాలి.
2. సైట్‌లో లేదా యాప్‌లో మీ 12 అంకెల ఆధార్ నంబర్ లేదా 16 అంకెల ఆధార్ వర్చువల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (వీఐడీ)ని ఎంటర్ చేయాలి.
3. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని సైట్ లేదా యాప్‌లో ఎంటర్ చేసి కన్‌ఫాం చేయాలి.
4. అనంతరం అక్కడ ఉండే ఆర్డర్ ఆధార్ రీప్రింట్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
5. ఆధార్ కార్డును స్పీడ్ పోస్టులో డెలివరీ అందుకునేందుకు గాను రూ.50 చార్జిలు సైట్‌లో లేదా యాప్‌లో చెల్లించాలి. క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్ విధానాల్లో ఆ చార్జిలను చెల్లించవచ్చు. చార్జిలను చెల్లించాక ఆర్డర్ ఆధార్ రీప్రింట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం 15 రోజుల్లోగా ప్రింట్ చేయబడిన ఆధార్ కార్డు మీ ఇంటికే డెలివరీ అవుతుంది.