తిరుపతి కొండపైకి వెళ్లే నకడ మార్గంలో భక్తులు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల ఆరేళ్ల చిన్నారిపై చిరుత పులి దాడిచేసి హతమార్చిన విషయం విధితమే. ఆ తరువాత టీటీడీ, అటవీశాఖ అధికారులు నాలుగు చిరుత పులులను బంధించారు. ఇంకా మరికొన్ని చిరుతలు నడక మార్గంలో సంచరిస్తున్నట్లు భక్తులు భయాందోళన చెందుతున్నారు. దీంతో ఇటీవలికాలంలో నడకమార్గంలో ప్రయాణించే వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది.
తిరుమల నడక మార్గంలో మరో చిరుతను బుధవారం ( సెప్టెంబర్ 6) సంచరిస్తున్నట్లు కెమెరాల్లో సిబ్బంది గుర్తించారు. . శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారాన్ని గుర్తించారు. దీంతో తిరుమల కాలినడక దారి భక్తులను టీటీడీ అలెర్ట్ చేసింది. యాభై రోజుల వ్యవధిలో ఐదు చిరుతల్ని టీటీడీ అధికారులు బంధించారు. చిరుతల సంచారంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో వాటిని కట్టడి చేయడంపై టీటీడీ దృష్టి సారించింది. చిరుతల సంచరాన్ని నిరోధించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది.