సీబీఐకి ఎమ్మెల్యే కవిత మరో లేఖ రాశారు. లిక్కర్ స్కామ్ ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఆమె పేరు ఉండటంతో పాటు ఈనెల 6న విచారణకు రావాలని సిబిఐ తెలిపింది.
దీంతో కవిత ఎఫ్ఐఆర్ కాపీ కొరగా దర్యాప్తు సంస్థ దాన్ని పంపింది. అందులో తన పేరు లేదని తాజాగా సిబిఐ కి మరో లేఖ రాసిన కవిత, 6న షెడ్యూల్ ప్రోగ్రాంలో ఉండటంతో ఈనెల 11, 12, 14, 15 తేదీలలో విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలని కోరారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిబిఐ కి సమాధానంగా మరో లేఖ రాసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, తాజాగా ప్రగతి భవన్ కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ తో ఆమె భేటీ కానున్నట్టు తెలుస్తోంది. లిక్కర్ స్కాంలో సిబిఐ విచారణపై ఆయనతో చర్చించనున్నట్లు సమాచారం.