ఈ ప్రభుత్వ స్కీమ్ తో రూ. 41 లక్షలు..!

-

చాలా మంది నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. ఈ మధ్య కాలంలో అయితే చాలా మంది ఇన్వెస్ట్ చేసేందుకు చూస్తున్నారు. పైగా ఎలాంటి రిస్క్ లేకుండా డబ్బులని ఇన్వెస్ట్ చెయ్యాలంటే స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అనువుగా ఉంటాయి. గ్యారంటీ రిటర్న్ లభిస్తుంది. అయితే స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఒకటి. ఇక దీని కోసం మరిన్ని వివరాలను చూస్తే.. ఈ స్కీమ్ లో చేరితే మనకు మంచిగా లాభాలు వస్తాయి.

పైగా పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందొచ్చు. గరిష్టంగా ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు ఈ స్కీమ్ లో మనం పెట్టచ్చు. కనీసం ఐదు వందలు పెట్టినా చాలు. మీరు పెట్టె డబ్బుని బట్టీ రాబడి వస్తుంది. పీపీఎఫ్ స్కీమ్‌పై 7.1 శాతం వడ్డీ వస్తోంది. ఈ వడ్డీ రేటు అనేది మూడు నెలలకు ఒకసారి మారుతూ ఉంటుంది. వడ్డీ రేటుని కేంద్రం మారుస్తూ ఉంటుంది.

కనుక ఒకసారి అవి పెరిగితే మరో సారి అవి తగ్గచ్చు. నెలకు రూ. 12,500 పొదుపు చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ. 41 లక్షల వరకు మీకొస్తాయి. ఈ స్కీమ్ లో ఇలా మీరు రూ. 22 లక్షలు పెడితే రూ. 18 లక్షలకు పైగా వడ్డీ రూపంలోనే వచ్చేస్తుంది. కావాలంటే మీరు మెచ్యూరిటీ కాలాన్ని ఎక్స్టెండ్ చేసేయచ్చు. ఈ స్కీమ్ కోసం మీరు పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళచ్చు లేదంటే బ్యాంక్ కి వెళ్ళచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news