కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభానికి అనుమతులు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే వివిధ కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతమంది విద్యార్థులు కరోనా వైరస్ ప్రభావం దృశ్యం వివిధ పరీక్షలు రాయలేక పోతున్నారు. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులందరికీ ఎంసెట్ పరీక్ష నిర్వహించింది. ఇక ఈ ఎంసెట్ పరీక్షలకు కరోనా వైరస్ ప్రభావం దృశ్యం వివిధ కారణాలతో కొంత మంది విద్యార్థులు హాజరు కాలేకపోయారు.
ఇక ఇలాంటి విద్యార్థులందరికీ తెలంగాణ విద్యాశాఖ సువర్ణ అవకాశాన్ని అందించింది. కరోనా వైరస్ కారణంగా ఎంసెట్ రాయ లేకపోయినా విద్యార్థులు అందరూ వెంటనే వివరాలు అందించాలని అంటూ ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ విద్యార్థులను కోరారు. ఈనెల 5వ తేదీ వరకు విద్యార్థులకు వివరాలు పంపించేందుకు అవకాశం ఉంది అంటూ ఆయన తెలిపారు. అయితే విద్యార్థుల హాల్ టికెట్ తో పాటు… కరోనా సోకినట్లు గా తెలిపేలా ఒక రిపోర్ట్ కూడా ఇవ్వాలని సూచించారు. ఇక ఇలా ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.