తిరుమల : టీటీడీ పాలక మండలి సభ్యుల నియామకంపై మరో పిటీషన్ దాఖలు అయింది. టిటిడి పాలకమండలి సభ్యుల నియామకం చట్ట విరుద్దమంటూ హై కోర్టును ఆశ్రయించారు బిజేపి అధికార ప్రతినిధి భాను వ్రకాష్ రెడ్డి. 18 మంది సభ్యులు నియామకం చట్ట విరుద్దమంటూ కోర్టు లో కేసు దాఖలు చేశారు భాను ప్రకాష్ రెడ్డి.
పోకల అశోక్ కూమార్, మల్లాడి క్రిష్ణారావు, విద్యాసాగర్, నందకుమార్, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, మల్లిశ్వరి, విశ్వనాథ్ రెడ్డి, మధుసూదన్ యాదవ్, సంజీవయ్య, రాంభూపాల్ రెడ్డి, పార్దసారధిరెడ్డి, శ్రీనివాసన్, రాజేష్ శర్మ, కేతన్ దేశాయ్, సనత్ కుమార్, రామేశ్వర్ రావు, మిలింద్ నర్వేకర్, శశిధర్ ల నియామకం చట్టవిరుద్దమని పిటీషన్ లో పేర్కొన్నారు భాను ప్రకాష్ రెడ్డి.
ఈ నేపథ్యంలో ఈ కేసులో ఇంప్లిడ్ అవ్వాలని 18 మంది సభ్యులకు నోటిసులు జారి చేసింది హై కోర్టు. ఇప్పటికే పాలక మండలి సభ్యత్వానికి రాజీనామ చేశారు ప్రశాంతి రెడ్డి. ఇక 18 సభ్యులకు హై కోర్టు నోటీసులు జారీ చేయడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.