IND VS SA : సౌత్ ఆఫ్రికా పై భారత్ మరో రికార్డు

-

టీమిండియా మరో సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్ ను గెలిచిన భారత జట్టు, తాజాగా వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది. ఇవాళ ఢిల్లీలో జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. తొలుత దక్షిణాఫ్రికాను 99 పరుగులకే కట్టడి చేసిన భారత్… 100 పరుగుల లక్ష్యాన్ని కేవలం 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

అయితే సౌత్ ఆఫ్రికా పై టీమ్ ఇండియా మరో రికార్డ్ సృష్టించింది. ఢిల్లీ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్ బంతుల పరంగా (185)మూడో అతిపెద్ద విజయం నమోదు చేసింది. అంతకుముందు 2008లో ఇదే జట్టుపై ఇంగ్లాండు 215 బంతుల తేడాతో విజయం సాధించి తొలి స్థానంలో నిలువగా, 2002లో ఆస్ట్రేలియా టీం 188 బంతుల తేడాతో సఫారీలపై గెలుపొందింది. అంతేకాదు వన్డేల్లో భారత్ సౌత్ ఆఫ్రికా ను 100 లోపు ఆల్ అవుట్ చేయడం ఇదే మొదటిసారి.

Read more RELATED
Recommended to you

Latest news