ఆర్ఆర్ఆర్ లో మరో విప్లవ వీరుడు…!

-

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దానయ్య నిర్మిస్తున్నారు. డీవీవీ బ్యానర్ పై దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో దర్శకుడు రాజమౌళి,

అదే స్థాయిలో సినిమాను అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా, కొమరం భీ౦ గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. చారిత్రాత్మక కథకు కల్పితాలు జోడించి రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో వీరుడి పాత్ర కూడా ఉంటుందని టాలివుడ్ వర్గాల్లో ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తుంది.

విప్లవ వీరుడు గద్దర్ ఈ సినిమాలో ఒక పాట పాడుతున్నారట. గద్దర్ ని తారక్ అడగడంతో ఈ సినిమాలో పాట పాడటానికి అంగీకరించినట్టు తెలిసింది. రాజమౌళి కూడా గద్దర్ ని ఒక పాట పాడమని కోరినట్టు సమాచారం. ఇద్దరు అడగడంతో కాదనలేని గద్దర్ ఈ సినిమాలో ఒక పోరాటానికి సంబంధించిన పాట పాడటానికి ఒప్పుకున్నారట. ఇక ఈ సినిమాను జూలై లో విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news