జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఆయన గురించి అమరావతి ప్రాంతంలో యువత పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. వారం రోజుల కిందట ఒకసారి అమరావతి ప్రాంతంలో పర్యటించిన జనసేనాని.. అప్పట్లో హల్చల్ చేశా రు. పోలీసుల ఆంక్షలను సైతం పక్కన పెట్టి మందడం ప్రాంతంలో ఆందోళన చేస్తున్న రైతుల శిబిరాల వద్దకు చేరుకున్నారు. వా రికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేయడం తెలిసిందే. అదేసమయంలో మిగిలిన విప క్షాలు జై అమరావతి అంటుంటే.. పవన్ మాత్రం జై అమరావతి అనేది మన నినాదం కాదని, జై ఆంధ్ర మన నినాదమని సంచలన వ్యాఖ్యలు చేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది.
ఇదిలావుంటే, నాడు వచ్చి ఆందోళనలకు మద్దతిచ్చిన పవన్ తర్వాత మళ్లీ ఆ విషయాన్ని మరిచిపోయినట్టు ఉన్నారనే వ్యాఖ్య లు వినిపిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికి మూడు సార్లు అమరావతి ప్రాంతంలో పర్యటించి రైతులకు మద్దతి చ్చారు. సెంటిమెంటును మరింత పెంచారు.అందుబాటులో ఉన్న నేతలను అమరావతికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అమరావతి ప్రాంతంలో టీడీపీ జెండాలు కనిపిస్తున్నాయి. అదేసమయంలో కమ్యూనిస్టులు కూడా మద్దతిచ్చారు. దీంతో ఈ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు కూడా అక్కడ కనిపిస్తున్నారు. జెండాలు సైతం ఎగురుతున్నాయి. ఇక, బీజేపీ నాయకుల సంగతి సరేసరి! నాయకులు వస్తున్నారు. కామెంట్లు చేస్తున్నారు.
ఇక, ప్రశ్నిస్తానంటూ.. పార్టీ పెట్టిన పవన్ మాత్రం ఏదో నామ్కేవాస్తేగా అన్నట్టు ఒకసారి వచ్చి వెళ్లారు. ఈ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, రైతుల కన్నీళ్లు తుడుస్తానంటూ ఆయన ఇచ్చిన భరోసాతో.. ఏకంగా ప్రతి ఒక్కరూ ఆయనపై ఆశలు పెట్టుకు న్నారు. ముఖాలకు చాలా మంది యువత పవన్ మాస్కులతో కనిపించారు కూడా. అయితే, అనూహ్యంగా ఆయన తెరమరుగ య్యారు. ఉంటాను.. ఉద్యమం చేస్తాను.. అని చెప్పిన పవన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో అమరావతిలో యువత నిరుత్సా హానికి గురయ్యారు. పోనీ.. పవన్ విషయాన్ని పక్కన పెడితే.. రాజధాని గుంటూరు జిల్లాకే చెందిన మరో కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ సైతం అప్పుడు పవన్ వెంట వచ్చి.. తర్వాత కనిపించడం మానేశారు.
దీంతో అసలు ఇప్పుడు రాజధాని గ్రామాల్లో జనసేన ఊసు లేకుండా పోయింది. ఇదే విషయాన్ని యువత కూడా ప్రశ్నిస్తున్నారు. మరి పవన్ వ్యూహం ఏంటో.. ఎప్పుడు మళ్లీ వచ్చి హల్చల్ చేస్తారో చూడాలి. కొసమెరుపు ఏంటంటే.. నాడు ప్రత్యేక హోదా కోసం తాను పోరాడేందుకు ముందుకు వచ్చినా.. ప్రజల్లో ఆ విధమైన ఫైర్ లేదుకాబట్టి వెనక్కి తగ్గిపోయానని చెప్పిన పవన్ ఇప్పుడు రాజధాని రైతులు రెండింతల ఫైర్‌తో పోరాడుతుంటే.. మరి వారికి అండగా నిలవకుండా ఏదో ఇలా వచ్చి అలా మాయమై పోవడం ఆయనకే చెల్లిందని.. ప్రజలను బురిడి కొట్టించడంలో మరోసారి పవన్ తన గేమ్ ఆడేశాడన్న విమర్శలే ఎక్కువుగా వినిపిస్తున్నాయి.