హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యం లో తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా… ఒక్కో దళిత కుటుంబానికి ఏకంగా రూ. 10 లక్షలు ఇవ్వనుంది ప్రభుత్వం. ఇక ఇప్పటికే… ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ హుజురాబాద్ లో ఈ నెల 16వ తేదీన ప్రారంభించారు. అయితే.. తాజాగా దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబడుతున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ. 500 కోట్ల నిధులను విడుదల చేసింది తెలంగాణ సర్కార్.
హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు అమలుకోసం మొత్తం 2000 కోట్ల నిధులు విడుదల చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన రూ. 500 కోట్ల తో పాటు ఇప్పుడు విడుదల చేసిన రూ.500 కోట్లు కలిపి హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పైలట్ ప్రాజెక్టు కు గాను మొత్తం రూ. 1000 కోట్ల నిధులు విడుదలయ్యాయి. కాగా.. వారం రోజుల్లోపు మరో రూ. 1000 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనున్నది. దాంతో సిఎం కెసిఆర్ ప్రకటించిన రూ. 2000 కోట్ల నిధులు పూర్తి స్థాయిలో విడుదల అవనున్నాయి.