ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు గత ప్రభుత్వం పెట్టిన పేర్లను తొలగిస్తోంది. 2014లో టీడీపీ పార్టీ ప్రవేశ పెట్టిన పథకాలను 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ కొన్నింటిని రద్దు చేశారు.కొన్నింటికి పేర్లు మార్చారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అన్ని శాఖలు, పథకాల్లో ప్రక్షాళన చేపట్టింది. ఇందులో భాగంగా గతంలో YSR రైతు భరోసాగా ఉన్న పథకం పేరును అన్నదాత సుఖీభవగా ప్రభుత్వం మార్చింది. దానికి అనుగుణంగా వెబ్సైటులో మార్పులు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఫొటోలను ఉంచింది.
కాగా ఇప్పటికే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల పథకాల పేర్లను పోస్ట్ మెట్రిక స్కాలర్‌షిప్ స్కీమ్‌గా మార్చేసిన విషయం తెలిసిందే.వృద్ధులు, వితంతువులకు అందజేస్తున్న వైఎస్సార్ పింఛన్ కానుకను ఎన్టీఆర్ భరోసాగా మార్చారు. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాల పేర్లను పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌గా మార్చేశారు. వైఎస్సార్ కల్యాణ మస్తును చంద్రన్న పెళ్లి కానుకగా మార్పు చేశారు.వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం, సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల పేర్లను బాలసంజీవనిగా పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.