దేశీయ టెలికాం దిగ్గజం జియో మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే జియో టెలికాం, ఏయిర్ ఫైబర్, బ్రాడ్ బ్రాండ్ వంటి ఇంటర్నేట్ సేవలు అందిస్తున్న జియో.. తాజాగా యూపీఐ సేవలు అందించేందుకు రంగం సిద్దం చేసింది. భారతీయులకు ఆన్‌లైన్ పేమెంట్స్ సేవలను సులభతరం చేసిన యూపీఐ సేవల్లోకి అడుగుపెట్టుడుతున్నట్లు జియో ప్రకటించింది.
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో భాగంగా జియో పేమెంట్ సొల్యూషన్స్‌కు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. దీంతో అన్ని రంగాల్లోనూ ఇకపై జియోతో డిజిటల్ పేమెంట్స్ చేసేందుకు లైన్ క్లియర్ అయింది. యూపీఐ(UPI) ఆన్ లైన్ పేమెంట్ పోర్టల్స్ అయిన గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే తరహాలోనే త్వరలో జియో పేమెంట్స్ యాప్ అందుబాటులోకి రానుంది. జియో రాకతో గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పేలు కూడా త్వరలో గట్టిపోటీని ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.