బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో ఎదురుదెబ్బ!

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే క్రమంలో ఆయనే ఇబ్బందుల్లో పడుతున్నారు.ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో పార్టీకి ప్లస్ అవ్వడం పక్కనబెడితే పార్టీకి మైనస్ అవుతోందని గులాబీ శ్రేణులే గుసగుసలాడుతున్నారు. రీసెంట్‌గా దామగుండం నేవీ రాడార్ సెంటర్ ఏర్పాటు చేయొద్దని కేటీఆర్ డిమాండ్ చేయగా.. గత ప్రభుత్వమే దానికి పర్మిషన్ ఇచ్చిందని కేంద్రమంత్రులు సైతం చెప్పడంతో కేటీఆర్ ఇరకాటంలో పడ్డారు.

తాజాగా ఖానాపూర్ సెగ్మెంట్‌లోని ఉట్నూర్ పీఎస్‌లో కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదు మేరకు కేటీఆర్‌పై కేసు నమోదైంది. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు విషయంలో కేటీఆర్ చేసిన ఆరోపణలు అవాస్తవమని, నిరాధార ఆరోపణలు చేసిన కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news