పోలీసుల మీద రాళ్లు రువ్వి కారం పొడితో దాడి.. అయినా వెనక్కు తగ్గకుండా !

-

ఓఎల్ఎక్స్ ఫ్రాడ్ కు పాల్పడుతున్న 18 మంది ముఠా సభ్యులని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి జాయింట్ సి పి అవినాష్ మహంతి కీలక అంశాలు బయట పెట్టారు. ఈ OLX నిందితులను పట్టుకునేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ధైర్య సాహసాలు ప్రదర్శించారని అన్నారు. OLX లో సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారని, ఈ ముఠా ఇంతకు ముందు బంగారం దొంగతనాలకు పాల్పడేవారని అన్నారు.

ఇప్పుడు టెక్నాలజీ వాడుతూ.. సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని అయన అన్నారు. హైదరాబాద్ పోలీసులు నిందితులను పట్టుకునేందుకు రాజస్థాన్ భరత్ పూర్ జిల్లాలోని కళ్యాణ్ పూరి చౌవేరా గ్రామాలకు వెళితే ఊర్లో వాళ్ళు, మహిళలు పోలీసులపై దాడులు చేశారని ఆయన అన్నారు. రాళ్లు రువ్వారని, కారం పొడి చల్లారని అయినా పోలీసులు ధైర్య సాహసాలు ప్రదర్శించి.. 18 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారని అన్నారు. ఈ ముఠా పై పిడి యాక్ట్ నమోదు చేస్తామన్న ఆయన ఇకపై సైబర్ నేరస్తుల పై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా పెట్టి.. ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news