పోలవరం ప్రాజెక్టు… ఆంధ్ర ప్రదేశ్ దశాబ్దాల కల. ఈ ప్రాజెక్టు ఎన్నో సంవత్సరాల నుంచి నిర్మాణం జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 60 శాతం పైగా పలనులు జరిగాయి. అయితే.. ఇలాంటి తరుణంలో జగన్ సర్కార్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అన్ని విధాలా సహకరిస్తామని.. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి పూర్తయ్యే మొత్తం నిధులు తామే భరిస్తామని.. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రం పేర్కొన్నా.. ఆచరణలో అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన సవరించిన అంచనా మొత్తంలో వివిధ రూపాల్లో ఇంత వరకు రూ.15,047 కోట్లు కేంద్రం కోత పెట్టింది. కేవలం రూ.35,950.16 కేట్లకే పెట్టుబడి అనుమతి ఇస్తామని.. కేంద్ర మంత్రి తాజాగా ప్రకటించారు. ఆ ప్రక్రియ వేగంగా.. సాగడం లేదు. ఇప్పటికే సందేహాలపై సందేహాలు వ్యక్తం చేసి.. రెండు కీలక కమిటీలు ఈ అంచనాలను ఆమోదించినా.. మళ్లీ పోలవరం అథారిటీ కొర్రీలపై కొర్రీలు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం.