జగన్మోహన్ రెడ్డి సర్కార్ కి మొదటి నుంచి న్యాయ స్థానాల్లో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా న్యాయ స్థానాల నుంచి తీర్పు వెలువడనుంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అటు ప్రతిపక్ష పార్టీలు కూడా జగన్ మోహన్ రెడ్డి సర్కారుపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సారి దేశ అత్యున్నత న్యాయస్థానంలో జగన్మోహన్రెడ్డి సర్కార్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.
తుళ్లూరు మాజీ తహసిల్దార్ సుధీర్ బాబు కేసులో స్టే ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో జగన్ సర్కార్ కు షాక్ తగిలింది. వారం రోజుల్లోగా ఈ కేసులో స్టే నిర్ణయం తీసుకోవాలంటూ ఏపీ హైకోర్టుకి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. వారం సమయం లోపు ఏపీ హైకోర్టు ఈ కేసును పరిష్కరించకపోతే అప్పుడు సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది అంటూ తెలిపింది అత్యున్నత న్యాయస్థానం. అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు జరపకుండా హై కోర్టు స్టే విధించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.