‘సరిలేరు నీకెవ్వరు’ నుండి సరైన సాంగ్ రాబోతోంది….!!

-

సూపర్ స్టార్ మహేష్ మరియు అనిల్ రావిపూడిల తొలి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు తన ఎంటైర్ కెరీర్ లో తొలిసారిగా ఒక మిలిటరీ మేజర్ పాత్రను ఈ సినిమాలో పోషిస్తుండడం విశేషం. బోర్డర్ లో దేశం కోసం పోరాడుతూ, ఆ తరువాత కర్నూలు చేరి శత్రువుల దుమ్ము దులిపే మాస్ హీరోగా కూడా మహేష్ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు టాక్. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. రావు రమేష్, మురళి శర్మ, రాజేంద్ర ప్రసాద్, సంగీత, హరితేజ, రఘుబాబు, బండ్ల గణేష్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు.
రత్నవేలు ఫోటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాను మహేష్, దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుండి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఒక బ్యూటిఫుల్ మెలోడియస్ గీతాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోందట సినిమా యూనిట్. ఇప్పటికే ఈ సినిమాకు పోటీగా అదే రోజున రిలీజ్ కాబోతున్న అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల అలవైకుంఠుపురములో సినిమా నుండి రెండు సాంగ్స్ ఇటీవల యూట్యూబ్ లో విడుదలై పెద్ద సక్సెస్ సాదించంచడంతో, వాటిని మించే రేంజ్ లో దేవి ఈ సాంగ్ ని కంపోజ్ చేసినట్లు టాక్ వినపడుతోంది.
అంతేకాక ఇటీవల దేవి, మహేష్ కాంబోలో వచ్చిన మహర్షి సినిమా సాంగ్స్ ఆశించిన రేంజ్ లో లేవని కొన్ని విమర్శలు రావడంతో, దేవి మరోసారి మహేష్ తో కలిసి చేస్తున్న ఈ సినిమా కోసం ఎంతో కసిగా పనిచేసి మరీ సాంగ్స్ ని కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే కేవలం త్వరలో రిలీజ్ కాబోయే ఈ ఒక్క సాంగ్ మాత్రమే కాక, సినిమాలోని మిగతా సాంగ్స్ కూడా రేపు రిలీజ్ తరువాత అదిరిపోవడం ఖాయం అని సినిమా యూనిట్ ఎంతో ధీమాగా ఉందట. మరి జనవరి 12న సంక్రాతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి….!!

Read more RELATED
Recommended to you

Latest news