ప్రస్తుతం సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో ఇన్ని రోజుల వరకు వాయిదా పడుతూ వస్తున్న హీరోల సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా.. ఖైదీ చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజు తెరకెక్కించిన మాస్టర్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఈ సినిమా విడుదల ఆగిపోయింది అన్న విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమా ఓటిటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది అని గతకొన్ని రోజులుగా వార్తలు వచ్చినప్పటికీ చిత్రబృందం మాత్రం వీటిని ఖండించింది. ఇక ఇప్పుడు సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ఇక ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మాస్టర్ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తారని ప్రస్తుతం కోలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని త్వరలోనే విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అటు అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.