కేజిఎఫ్ 2 శాండిల్ వుడ్ గౌరవాన్ని జాతీయస్థాయిలో తీసుకువెళ్లిన సినిమా.ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ పిక్చర్ తో హీరో యాష్ ఎక్కడికో వెళ్లిపోయాడు.సౌత్ స్టార్ హీరోగా నోటెడ్ అయ్యాడు.ఈసినిమా సెకండ్ పార్ట్ కోసం దేశవ్యాప్తంగా సినీ జనాలను ఎదురుచూసేలా చేశారు.ఫ్రేమింగ్ నుంచి డైలాగ్స్ వరకు ప్రతీది సాలిడ్ గా సెట్ అయింది.అందుకే శాండిల్ వుడ్ నుంచి 100కోట్ల వసూళ్ళు రాబట్టగలిగారు.
కేజిఎఫ్ 2 కోసం ఎంతో ఆతృతంగా ఎదురుచూసే ఫిల్మీ లవర్స్ ఇండియన్ వైజ్ ఉన్నారు.కరోనా కారణంతో రిలీజ్ లేటవుతూ వస్తున్న ఈ ప్రాజెక్ట్.. అక్టోబర్ 3న ఇచ్చిన ప్రొడ్యూసర్ ట్వీట్ తో ఓ క్లారిటీ వచ్చేసింది.థియేటర్లు ఓపెన్ చేసినా ఆడియన్స్ వస్తారని గ్యారంటీ లేని ఈ టైమ్లో.. కేజిఎఫ్ 2 ఆక్యుపెన్సీ విషయంలో గేమ్ చేంజర్ అవుతుందని చాలామంది భావిస్తున్నారు.
ఈ సినిమా నిర్మాత విజయ్ కిరంగదూర్ పుట్టినరోజైన అక్టోబర్ 3న “ఈ సంవత్సరం తమకు అతిపెద్దదిగా ఉంటుంది” అని హింట్ ఇవ్వడం ఆసక్తిని రేకెత్తించింది. దీన్ని బట్టి ఈ సంవత్సరమే కేజీఎఫ్-2రిలీజ్ ఉంటుందని చెప్పకనే చెప్పాడు. కన్నడ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నదాని ప్రకారం “కేజిఎఫ్ -2″ను ఈ డిసెంబర్లో తీసుకువచ్చేలా ఉన్నారు.కేజీఎఫ్: చాప్టర్ 2 లోను రాకీ భాయ్ పాత్రలో యష్ కనిపిస్తాడు. సంజయ్ దత్ అధీరాగా కనిపించనున్నాడు.
అక్టోబర్ 15తర్వాత థియేటర్లు ఓపెన్ అవుతూ ఉండడంతో అన్ని భాషా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి.అయితే కరోనా ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగానే ఉండడంతో ఆడియన్స్ థియేటర్లకు అనుకున్నంత స్థాయిలో వస్తారని అనుకోవడానికి లేదు.మరి వారు రావాలి అంటే ఆడియన్స్ ను అటెన్షన్ లోకి తీసుకువచ్చే బొమ్మ థియేటర్లో పడాలి. అది ఇపుడున్న టైమ్లో కేజిఎఫ్ 2 మాత్రమే. ఇండియన్ సినిమాకు కరోనా ఎఫెక్ట్ ను బ్రేక్ చేసి నిలబడిన గేమ్ చేంజర్ గా కేజిఎఫ్ 2 నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.