విశాఖ సాగర తీరంలో మరో టూరిజం స్పాట్ …!

-

విశాఖ ఒడిలో మరో అతిధి చేరబోతోంది. విశాఖలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయ్. బంగ్లాదేశ్ వాణిజ్యనౌక “ఎంవీ-మా”ను టూరిజమ్ స్పాట్‌గా మార్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయ్.ప్రతికూల వాతావరణంలో చిక్కుకుని ఆ బోటు గత నెల 12న తెన్నేటి పార్కుకు కొట్టుకొచ్చింది బంగ్లాదేశ్ వాణిజ్య నౌక. ఇప్పుడు ఆ నౌక పర్యాటక కేంద్రంగా మారనుంది.

కొద్ది రోజుల పాటు నౌకను తిరిగి సముద్రయానం చేయించేందుకు విస్త్రృతమైన ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. సుమారు 3వేల టన్నుల బరువు…80 మీటర్ల పొడవు కలిగిన ఈ నౌకను తరలించేందుకు విఫలయత్నం చేశారు. ఇందుకోసం లక్షల రూపాయలు వ్యయం చేశారు. ఐఎన్ఎస్ విరాట్‌ యుద్ధ నౌకను విశాఖలో పర్యాటక ప్రాజెక్టుగా మార్చాలని గతంలో ప్రయత్నించారు. ముంబై నావల్‌ డాక్‌ యార్డ్‌లో ఉన్న ఈ నౌకను విశాఖకు తీసుకురావాలని అప్పటి ప్రభుత్వం ప్రయత్నించింది. ఐతే…విరాట్‌ నౌకను ఏపీకి తీసుకొచ్చి…దాన్ని మ్యూజియంగా మార్చాలంటే సుమారు 1000కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news