బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన మందుబాబులు రోహిత్, సుమన్ మూడు పబుల్లో పార్టీ చేసుకున్నట్లు గుర్తించారు పోలీసులు. మూడు పబ్ ల్లో సిసి కెమెరాలు ఫుటేజ్ సేకరించారు పోలీసులు. పబ్ నుండి బయటకి రాగానే బంజారాహిల్స్ హోటల్ లో ఉండేందుకు వచ్చాడు రోహిత్…దీంతో రోహిత్ పై 304 (2) , సుమన్ పై 109 ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.
ఆక్సిడెంట్ చేసిన తరువాత పోలీసుల కళ్లుగప్పి పరారైయ్యారు రోహిత్, సుమంత్. అయితే… ఆ ఇద్దరిని వెంటాడి పట్టుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా వెస్ట్ జోన్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ మట్లాడుతూ… బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని.. ఈ కేసులో ప్రధాన నిందితుడు రోహిత్ తో పాటు సుమన్ పై 304 (2).కింద , 109 ఐపీసీ సెక్షన్లు కింద కేసులు పెట్టామన్నారు.
ఈ కేసులో టెక్నీకల్ ఏవిడెన్స్ ఆధారంగా ఆధారాలు సేకరించి, ఛార్జ్ షీట్ వేస్తామని వివరించారు. వెస్ట్ జోన్ లో పబ్ లు, బార్ లు పై కూడా నిఘా ఉంటుందని… మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇక నుండి కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడించారు. ఎక్కువ గా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో యూత్ పట్టుబడుతున్నారన్నారు. వారి తల్లిదండ్రులు కూడా పిల్లలు పై నిఘా ఉంచాలని పేర్కొన్నారు. ఈ కేసులో పక్క ఆధారాలతో ఛార్జ్ షీట్ వేసి నిందితులకు శిక్ష పడేలా చేస్తామన్నారు.