ఇటీవల ప్రభుత్వంపై రోజుకోసారి స్పందిస్తున్నారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మళ. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ధాన్యం కొనుగోలు అంశంపై పలుమార్లు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. తాజాగా మరోసారి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వైద్య విధానాలపై మరోసారి విమర్శించారు వైఎస్ షర్మిళ.
తాజాగా షర్మిళ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని YSR గారు 104 సేవలను ప్రవేశపెడితే, ఇప్పుడు కేసీఆర్ సర్కార్ ఇప్పటివరకు ప్రారంభించని పల్లె దవాఖానాల పేరిట 104 సేవలను బంద్ పెట్టాలని చూస్తోంది. మీరు ప్రవేశపెట్టిన కంటి వెలుగు కంటికి కనపడకుండా పోయింది, బస్తీ దవాఖానాలకు సుస్తీ చేసింది.. సర్కార్ దవాఖానలో సౌలతులు కరువైనయి.పల్లె హాస్పిటల్స్ ప్రారంభం కాకముందే104 బందు చేస్తున్నారంటే మీకు ప్రజల ప్రాణాల మీదున్న ప్రేమ అంతులేనిది. సౌలతులు లేక, వైద్యం అందక సర్కార్ దవాఖానల్లో జనం కరోనాతో చస్తుంటే సదుపాయాలు కల్పించలేనప్పుడే ప్రజల ప్రాణాల మీద మీకున్న ప్రేమ తెలిసిపోయింది‘ అంటూ విమర్శించారు.
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని YSR గారు 104 సేవలను ప్రవేశపెడితే, ఇప్పుడు కేసీఆర్ సర్కార్ ఇప్పటివరకు ప్రారంభించని పల్లె దవాఖానాల పేరిట 104 సేవలను బంద్ పెట్టాలని చూస్తోంది. మీరు ప్రవేశపెట్టిన కంటి వెలుగు కంటికి కనపడకుండా పోయింది, బస్తీ దవాఖానాలకు సుస్తీ చేసింది..
1/2— YS Sharmila (@realyssharmila) December 7, 2021