భారత్-పాక్ ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లపై కేందమంత్రి కీలక వ్యాఖ్యలు

-

సరిహద్దు సమస్యలు, ఉగ్రవాదం, రాజకీయ కారణాలతో భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. 2012-13 సీజన్ లో ఇరుదేశాల మధ్య చివరి ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అప్పటి నుంచి భారత్, పాకిస్థాన్ జట్లు కేవలం ఐసీసీ ఈవెంట్లు, ఇతర టోర్నీల్లోనే తలపడుతున్నాయి. తాజాగా ఆసియాకప్ లోనూ భారత్ ఆడే మ్యాచ్ లు ఆతిధ్య దేశం పాకిస్తాన్ లో కాకుండా తటస్ధ వేదిక అయిన శ్రీలంకలో ఆడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం భారత్-పాక్ మ్యాచ్ లపై కీలక ప్రకటన చేసింది.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు పునరుద్ధరిస్తారన్న ప్రశ్నకు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ సమాధానమిచ్చారు. సరిహద్దుల్లో ఉగ్రవాదం, భారత్‌లో చొరబాట్లను అరికట్టే వరకు పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక క్రికెట్ ఉండదని బీసీసీఐ చాలా కాలం క్రితమే నిర్ణయించిందని ఠాకూర్ తెలిపారు. ఐసీసీ, విదేశీ ఈవెంట్‌లలో రెండు జట్లు మాత్రమే మ్యాచ్‌లు ఆడటంతో రెండు పొరుగు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా భారతదేశం ,పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు సంవత్సరాలుగా నిలిపివేశారు. క్రీడల విషయానికొస్తే, చొరబాట్లు ,సరిహద్దు ఉగ్రవాదాన్ని ఆపే వరకు పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక మ్యాచ్‌లు నిర్వహించకూడదని బీసీసీఐ చాలాకాలం క్రితమే నిర్ణయించిందన్నారు.ఇది ఈ దేశంలోని ప్రతి సాధారణ పౌరుడి సెంటిమెంట్ అని తాను భావిస్తున్నట్లు ఠాకూర్ తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version