పవన్ “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా కంప్లీట్ అవుతుందా ?

-

హరీష్ శంకర్ కెరీర్ మొదట్లో పవన్ కళ్యాణ్ తో తీసిన రీమేక్ మూవీ గబ్బర్ సింగ్ టాలీవుడ్ రికార్డులు తిరగరాసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా .. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. ఆ తర్వాత నుండి ఇద్దరూ మళ్ళీ సినిమా చెయ్యాలని అనుకుంటున్నా కుదరడం లేదు. అయితే గత సంవత్సరం ఉస్తాద్ భగత్ సింగ్ ను పవన్ తో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు చిత్ర నిర్మాతలు. కానీ ఎందుకో చాలా అడ్డంకులు వస్తూ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ డేట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. షూటింగ్ కూడా మొదలైంది… పవన్ ఇచ్చిన సమయాన్ని వాడుకుని త్వరగానే సినిమాను పూర్తి చెయ్యాలని పట్టుదలతో ఉన్నాడు.

కానీ ఏపీలో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన నేపథ్యంలో నిన్న మీడియా సమావేశంలో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయని చెప్పడంతో… ఇక పొలిటికల్ గా ఎక్కువ సమయాన్ని తీసుకోనున్నాడని చెప్పకనే చెబుతున్నాడు. దీనిని బట్టి సినిమా షూటింగ్ పరిస్థితి అధోగతి అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version