లిక్కర్ స్కామ్ లో ఎంతటి వారైనా శిక్ష తప్పదు – తరుణ్ చుగ్

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దోషులుగా ఉన్నవారు ఎంతటి వారైనా సరే శిక్ష తప్పదని అన్నారు తెలంగాణ బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరున్ చుగ్. ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ లో కవిత ప్రస్తావన ఉందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత పేరు మొదటి నుంచి లిక్కర్ స్కాం లో వచ్చిందన్నారు. ఈడి లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర పై స్పష్టమైన ఆధారాలతో చార్జ్ షీట్ దాఖలు చేసిందని తెలిపారు.

కవిత తన నివాసంలో సమీర్ మహేంద్ర తో పాటు ఇతరులను కలవడం… ఢిల్లీ ఓబెరాయ్ హోటల్లో సమావేశాలు నిర్వహించడం అన్నింటి ప్రస్తావనను ఈడి స్పష్టం చేసిందన్నారు. అరవింద్ కేజ్రీవాల్ సౌత్ గ్రూప్ తో కలిసి పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు తరుణ్ చుగ్. 100 కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారాయన్నారు. ఈ స్కామ్ జరిగినట్లు ఈడి స్పష్టం చేస్తుందన్నారు.

తెలంగాణను దోచుకున్న కెసిఆర్ ఆయన కుటుంబం ఇప్పుడు ఢిల్లీ దాకా వచ్చారని.. మరోవైపు టిఆర్ఎస్ పేరును బిఆర్ఎస్ గా కూడా మార్చుకున్నారని అన్నారు. లిక్కర్ స్కామ్ లో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో ఎన్నోసార్లు కవిత పేరు ప్రస్తావనకు వచ్చిందన్నారు. ఫోన్లు సిమ్ములు ఎందుకు మార్చాల్సి వచ్చింది? అని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ లో దోషులుగా ఉన్నవారు ఎంతటి వారైనా సరే శిక్ష తప్పదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news