రాజధాని బిల్లు గురించి ఓవైపు అధికారపక్షం.. మరోవైపు ప్రతిపక్షం పోరాడుతున్నాయి. అయితే రాజధాని బిల్లును ఎలాగైనా గట్టెక్కించాలని ప్రభుత్వం భావించింది. అసెంబ్లీలో 151 మంది సభ్యుల బలంలో బిల్లును పాస్ చేయించుకుంది. అయితే శాసనమండలిలో మాత్రం ప్రభుత్వానికి పరాభవం తప్పలేదు. దీంతో వికేంద్రీకరణ బిల్లుపై తాడోపేడో తేల్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకోసం ప్రభుత్వం సన్నాహకాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
మంగళవారం వరకు అసెంబ్లీ సమావేశాలను పొడగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. మరోవైపు బుధవారం శాసనమండలిలో ఉత్కంఠ కొనసాగింది. సెలెక్ట్ కమిటీకి రాజధాని వికేంద్రీకరణ బిల్లును పంపాలని మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలిలో టీడీపీ పైచేయి సాధించింది. మంత్రుల ప్రయత్నాలు, తీవ్ర ఉత్కంఠ మధ్య మండలి ఈ నిర్ణయం తీసుకుంది.