‘సరిలేరు’ కు సరైన కలెక్షన్ రాకపోవడం వల్లే మహేష్ ప్రమోషన్స్ చేస్తున్నారా….??

-

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల నటించిన భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో మంచి సక్సెస్ ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ నటించిన సినిమా సరిలేరు నీకెవ్వరు, మొన్న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక సంక్రాంతి పండుగతో వరుసగా సెలవలు కావడంతో ఈ సినిమాకు పర్వాలేదనిపించేలా కలెక్షన్స్ వచ్చాయి. ఇకపోతే  మొన్న సోమవారం నుండి ఈ సినిమా థియేటర్స్ అన్ని కూడా చాలా వరకు ఖాళీగానే కనపడుతున్నాయి.

Mahesh Babi in MIND BLOCK song in Sarileru

అయితే మరోవైపు తమ సినిమాకు అద్భుతంగా కలెక్షన్స్ వస్తున్నాయి అంటూ సరిలేరు సినిమా యూనిట్ పలు పోస్టర్స్ ని రిలీజ్ చేస్తోంది. అయితే ఇందులో చాలావరకు నిజం లేదని, ఆ పోస్టర్స్ అన్నీ కూడా ఫేక్ అని కొందరు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. దీనిని గ్రహించిన మహేష్, దెబ్బతిన్న సినిమాను తనవంతుగా ప్రమోట్ చేయడం మాత్రం మానడం లేదు. ఇటీవల కూతురు సితార నెలకొల్పిన యూట్యూబ్ ఛానల్ లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన మహేష్ బాబు, రెండు రోజుల క్రితం కొందరు ఆర్మీ జవానులతో కలిసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

మహేష్ తో పాటు సరిలేరు దర్శకుడు అనిల్ రావిపూడి, నటి విజయశాంతి కూడా పాల్గొన్న ఈ వీడియో ప్రోమో నిన్న రిలీజ్ అయింది. అయితే ఈ విధంగా మహేష్ చేస్తున్న ఈ ప్రమోషన్ ట్రిక్కులన్నీ కూడా సరిలేరుని ప్రమోట్ చేయడానికేనని, నిజానికి సినిమా చాలావరకు నష్టాలు మిగిల్చిన విషయం తెలిసిన మహేష్, దానిని కప్పిపుచ్చుతూ పైకి మాత్రం అద్భుతం అంటూ బిల్డప్ లు ఇస్తున్నారని అంటున్న వారు కూడా లేకపోలేదు. మరి ఈ విధంగా సాగుతున్న సరిలేరు ఫేక్ రికార్డ్స్ కి అడ్డుకట్ట పడేదెపుడో చూడాలి…..!!

Read more RELATED
Recommended to you

Latest news