మొసళ్ల స‌ర‌స్సులో ఈత‌..మోడీపై ఏపీ బీజేపీ పోస్ట్ వైర‌ల్..!

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఎంతో క‌ష్ట‌ప‌డి ప్ర‌ధాని స్థాయి వ‌చ్చార‌ని చెబుతుంటారు. ఆయ‌న జీవితంలో కొంత‌కాలం పాటు ఛాయ్ కూడా అమ్మార‌ని చెబుతుంటారు. అయితే ఛాయ్ అమ్మ‌డం ఎంతో క‌ష్ట‌ప‌డం న‌మ్మేవిష‌య‌మే. కానీ ఏపీ బీజేపీ అధికారిక సోష‌ల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ న‌మ్మేలా లేదు…దాంతో ఆ పోస్ట్ పై విమ‌ర్శ‌లు ట్రోల్స్ వ‌స్తున్నాయి. తెలివైన‌పిల్ల‌వాడు న‌రేంద్ర అంటూ ఏపీ బీజేపీ ఈ పోస్ట్ ను చేసింది.

ఇక పోస్ట్ లో అత‌నికి కేవ‌లం ఏడు నుండి ఎనిమిది సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు మొస్స‌ళ్లు ఉన్న స‌ర‌స్సులో ఈదేవాడు..ఆల‌య శిఖ‌రం పై జండాలు ఎగ‌ర‌వేశాడు. అంతే కాకుండా అదే స‌ర‌స్సులో నుండి ఓ మొస‌లి పిల్ల‌ను కూడా న‌రేంద్ర ఇంటికి తీసుకువ‌చ్చాడు. దాంతో అత‌డి త‌ల్లి మ‌ళ్లీ ఇలాంటి ప‌నులు చేయ‌కూడ‌ద‌ని చెప్ప‌డంతో ఆ మొస‌లి పిల్ల‌ను నీటిలో వ‌దిలేసి వ‌చ్చాడు. అంటూ ఏపీ బీజేపీ చిన్న క‌థ‌ను పోస్ట్ చేసింది. ఇక ఈ క‌థ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది.