కుదేలవుతున్న రియల్ ఎస్టేట్.. కూలుతున్న చైనా ఆర్థిక వ్యవస్థ..

-

ఆర్థికంగా అమెరికాతో పోటీపడుతున్న చైనాకు పెద్ద దెబ్బ తగిలింది. ప్రస్తుతం చైనాలో ఆర్థిక రంగం కుదేలవుతుంది. రియల్ ఎస్టేట్ కుప్పకూలుతుంది. 50కిపైగా నగరాల్లో భవంతులన్నీ ఖాళీగా ఉన్నాయి. దెయ్యాల నగరంగా పేరు తెచ్చుకున్నాయి. చుట్టూ పెద్ద పెద్ద భవంతులు, అందమైన పార్కులు కలిగి ఉండి కూడా ఒక్క మనిషి కూడా కనిపించని ప్రాంతాలుగా మారాయి. ప్రస్తుతం ఈ అంశం చైనాలో ఆర్థిక నష్టాన్ని తీసుకువస్తున్నాయి. నాలుగు దేశాల జనాభాకు సరిపోయేలా ఉన్న ఇళ్ళలో ఒక్క మనిషి కూడా లేడు.

ఖాళీగా ఉన్న మొత్తం ఇళ్ళల్లో 9కోట్ల మంది దాకా ఉండవచ్చు. అప్పులు ఇచ్చి మరీ అతిపెద్ద నగరాలను సృష్టించి, అతిపెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఎవర్ గ్రాండే పేరుతో నిర్మించిన ఈ నగరాలను కృత్రిమంగా సృష్టించింది చైనా. గ్రామీణ ప్రాంత ప్రజలను ఇక్కడ నివసించేలా చేద్దాం అని భావించింది. కానీ అది వీలు కాలేదు. దాంతో ఈ నగరాలన్నీ జనాలు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. ఒక్కో నగరంలో వెయ్యి మంది మాత్రమే నివసిస్తున్నారంటే చైనా వేసిన వ్యూహం ఎంత ఘోరంగా విఫలం అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం అప్పులు ఇచ్చిన బ్యాంకులు వడ్డీలు కట్టమని కంపెనీలను సతమతపెడుతున్నాయి. అటు చైనా ప్రభుత్వం కూడా కొత్త కొత్త నిబంధనల పేరుతో కంపెనీల మెడ మీద కత్తి పెడుతున్నాయి. అప్పులు చేసి దయ్యాల నగరాలను సృష్టించిన చైనా, ఈ నష్టాలను దాటి ఎలా బయటకు వస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news