దేవాదాయశాఖ కార్యాలయాన్ని ముట్టడించిన ఒగ్గు కళాకారులు..

-

హైదరాబాద్ అబిడ్స్ బొగ్గులకుంట లోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు తెలంగాణ రాష్ట్ర ఒగ్గు బీర్ల కళాకారులు. మల్లన్న ఒగ్గు కథ చెబుతూ.. ఒగ్గు సంప్రదాయ పూజలు చేసి నిరసన తెలిపారు ఒగ్గు పూజారులు. సిద్దిపేట జిల్లా కొమ్మరవేల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం లో ఒగ్గు పూజారులను గర్భగుడి పూజల నుండి బహిష్కరించడం దారుణమని.. ఎన్నో ఏళ్లుగా పూజారులుగా కొనసాగుతున్న తమను తొలిగించి..వీర శైవ (బలిజ) పూజారులను కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఒగ్గు బీర్ల కళాకారులు.

స్వామి వారి మేలుకొలుపు, పవలింపు సేవా ఒగ్గు పూజారులచే మూల విరాట్ మల్లన్న స్వామి దగ్గర నిలబడి చేయించడం ఆనవాయితీ అని.. ఆ సేవలు, పూజల నుండి మమ్మల్ని దేవస్థానం అధికారులు దూరం చేయడం అన్యాయమని మండిపడ్డారు. తరతరాలుగా స్వామి వారికి చేస్తున్న సేవలను యధావిధిగా ఒగ్గు పూజరుల చే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయం పై వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్,దేవాదాయ శాఖ అధికారులు జోక్యం చేసుకొని మాకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news