అమరావతి : కాసేపటి క్రితమే ముగిసింది ఏపీ కేబినెట్. అయితే ఇవాళ్టి కేబినెట్ సమావేశంలో తెలంగాణతో నీటి వివాదంపై ప్రస్తావన వచ్చింది. తెలంగాణలో ఏపీ ప్రజలున్నారని.. వాళ్లకు ఇబ్బంది కలగకూడదనే సంయమనంతో ఉన్నామని సీఎం జగన్ మంత్రులతో చెప్పారని సమాచారం. అలాగే టీఆర్ఎస్ మంత్రులు దూకుడుగా మాట్లాడుతున్నారన్న సీఎం జగన్… తెలంగాణలో ఉన్న ఏపీ వారు ఇబ్బందులు పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్న సీఎం జగన్.. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అలాగే శ్రీశైలం విద్యుత్పత్తి ఆపేయాలని కోరుతూ కేఆర్ఎంబీకి మరో లేఖ రాయాలని సీఎం జగన్ ఆదేశారు జారీ చేశారు.
అంతేకాదు.. తెలంగాణతో ఉన్న జల వివాదాలపై చర్చ చర్చించిన ఏపీ కేబినెట్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రయోజనాలే తమకు ముఖ్యమని.. చుక్క నీరు కూడా వదిలే ప్రసక్తే లేదని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.