అన్ లాక్ 1.0 మొదలైనప్పటి నుండి తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలను హెల్త్ బులెటిన్ ద్వారా మీడియాకు విడుదల చేసింది. బులిటెన్ ఆధారంగా రాష్ట్రం మొత్తంగా గడచిన 24 గంటల్లో ఏకంగా 20,567 శాంపిల్స్ ను పరీక్షించగా అందులో 961 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 37 మందికి కూడా పాజిటివ్ గా తేలడంతో మొత్తంగా 998 కేసులు పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. దీనితో ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18,697 కు చేరుకుంది.
మరోవైపు రాష్ట్రంలో 391 మంది కరోనా బారి నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా 8,422 మంది కరోనా బారి నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 7,907 మంది ఆస్పత్రులలో, అలాగే 2136 మంది కోవిడ్ కేర్ సెంటర్ లో మొత్తంగా 10,043 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 10,17,140 శాంపిల్స్ ను పరీక్షించారు. గడచిన 24 గంటల్లో గుంటూరు జిల్లాలో అధికంగా 157 కేసులు నమోదయ్యాయి. అలాగే అత్యధికంగా ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో 2451 కేసులు నమోదయ్యాయి.
#COVIDUpdates: 05/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 16,102 పాజిటివ్ కేసు లకు గాను
*6828 మంది డిశ్చార్జ్ కాగా
*232 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 9042#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/vZAFJroM6u— ArogyaAndhra (@ArogyaAndhra) July 5, 2020