తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. ప్రజలను దాటుకుని ప్రజాప్రతినిధులను కూడా కరోనా కబళించింది. ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు కూడా కరోనా భారిన పడ్డారు. తాజాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కరోనా సోకిందని ఆదాబ్ హైదరాబాద్ అనే దినపత్రిక కథనం ప్రచారం చేసింది. దీంతో రాష్ట్రంలో ఆందోళన నెలకొంది. ఇటీవల హరితహారం కార్యక్రమంలో భాగంగా నర్సాపూర్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్న విషయం తెలిసిందే.
ఆ కార్యక్రమం నుండే ఆయనకు వైరస్ సోకి ఉండవచ్చని ఆ కథనంలో పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా కేసీఆర్ తన ఫార్మ్ హౌస్ కే పరిమితం అయిపోయారు. దీనితో ఆయనకు అక్కడ సీక్రెట్ గా చికిత్స చేస్తున్నారు అంటూ ఆ పత్రిక పేర్కొంది. వారం రోజులుగా కేసీఆర్ ఫార్మ్ హౌస్ లోనే ఉండడం… అక్కడ నుండే సమీక్షలు చెయ్యడంతో ఇది నిజమేనని భావిస్తున్నారు ప్రజలు. అయితే ఇది ఊహాజనితమైన కథనం అని తెరాసలోని కొందరు ముఖ్య నేతలు అంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఏంటో తెలియాలంటే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సిందే.