అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్రమంత్రి అమిత్‌షాను ఆయన కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన సమస్యలు, వ్యాక్సినేషన్‌కు సంబంధించిన అంశాలపై అమిత్ షాతో జగన్ చర్చించనున్నారు. బెయిల్ పిటిషన్ రద్దు, ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
నిజానికి రెండు రోజుల క్రితమే జగన్ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే కేంద్రమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ దొరకపోవడంతో ఆ పర్యటన రద్దు అయింది. దీంతో తాజాగా జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులను ఆయన కలుస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నారు. జగన్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయంటున్నారు. అయితే అమిత్ షాను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మరి ఏం జరుగుతుందో గురువారం చూడాలి.