ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ప్రకటన చేసారు. ఏపీ లో కూడా లాక్ డౌన్ చేస్తున్నామని ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేసారు. ఏపీలో ఆరు పాజిటివ్ కేసుల్లో ఒక్కటి నయం అయిందని చెప్పారు. అత్యవాసర సరుకుల కోసం ఒక్కరే ఇంటి ఉంచి ఒకరే వెళ్ళాలి అని జగన్ సూచించారు. మిగిలిన రాష్ట్రాల కన్నా మన రాష్ట్రము చాల సురక్షితంగ ఉందన్నారు.
వాలంటీర్స్ ,ఆశ వర్కర్లుకి ,గ్రామసచివాలయం వాళ్ళకి తన అభినందనలు తెలియజేసారు. జనతాకర్ఫ్యూ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా నివారణకు అధికారులు బాగా కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రతి నియోజకవర్గంలో 100 ఐసోలేటెడ్ పడకలు ఏర్పాటు చేసామని అన్నారు. వైద్య చికిత్స తీసుకున్నాక కొంత మందికి ఇంటికి వెళ్లారని జగన్ వ్యాఖ్యానించారు.
విదేశాల మంది నుంచి 11670 వచ్చారని, ప్రతి జిల్లా కేంద్రంలో 200 ఐసోలేటెడ్ పడకలు ఏర్పాటని చేసామని చెప్పారు. విదేశాలు వచ్చిన వారు వెంట తిరిగిన వారు కూడా పరిక్షలు చేయించుకోవాలని జగన్ కోరారు. విదేశాల నుంచి వచ్చే వాళ్ళు స్వీయ నిర్భంధంలోకి వెళ్లాయని అన్నారు. సినిమా హాల్స్ ,షాపింగ్ మాల్స్ ఇప్పటికే మూసివేసామని చెప్పారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలు అంత సహకరించాలన్నారు జగన్.
పదో తరగతి పరీక్షలు యధాతదమని అన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలు అంత సహకరించాలని జగన్ కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు రొటేషన్ పద్దతిలో విధుల్లోకి వెళ్ళాలి అన్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మొత్తం బంద్ చేస్తున్నామని చెప్పారు. ప్రజలందరు ఎక్కడ వారు అక్కడ ఉంటేనే కరోనా ని కట్టడి చేయగలమని అన్నారు. రాబోయే వారం రోజులు పాటు కఠిన నిర్ణయాలు అమలు చేస్తామని చెప్పారు.
అత్యవసర సరుకుల విషయంలో ఎవరైనా వ్యాపారం చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని జగన్ హెచ్చరించారు. ఎవరిని అయినా సరే జైలుకి పంపడానికి కూడా వెనుకాడే పరిస్థితి లేదని అన్నారు. కలెక్టర్లు త్వరలోనే ఏ వస్తువు ధర ఎంత ఉంటుందో అంతకే అమ్ముతామని జగన్ స్పష్టం చేసారు. 10 మంది మించి ఎక్కడా కూడా గుమి కూడవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. వారం రోజుల పాటు ఫ్యాక్టరీలు అన్ని మూసి వేశామని అన్నారు.అసెంబ్లీ సమావేశాలను కూడా త్వరగా పూర్తి చేస్తామని స్పష్టంగా చెప్పారు. బడ్జెట్ అనేది చాలా కీలకమని అందుకే తప్పడం లేదని అన్నారు. ప్రతి కుటుంబానికి ఒక 1000 రూపాయలు కేజీ కంది పప్పు, రేషన్ బియ్యం ఫ్రీ గా ఇస్తామని చెప్పారు. ఏప్రిల్ నాలుగున వాలంటీర్లు వచ్చి అందిస్తారని చెప్పారు జగన్.