మైలేజ్ కోల్పోతున్న జగన్ మోహన్ రెడ్డి !

-

2019 సార్వత్రిక ఎన్నికలలో అత్యంత భారీ మెజార్టీతో ప్రజల అభిమానులను అందుకున్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. అయితే కొన్ని విషయాలలో చాలా మొండితనం గా వ్యవహరించడంతో పాటు మీడియాకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో జగన్ మైలేజ్ రోజు రోజుకి తగ్గిపోతున్నట్లు ఇటీవల వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన సందర్భంలో కరోనా వైరస్ వ్యాధిని చాలా తేలిగ్గా తీసుకున్నట్లు సీఎం జగన్ కామెంట్ చేయడంతో ఆయన పై సోషల్ మీడియాలో సెటైర్లు భారీ స్థాయిలో పడ్డాయి. Image result for ys jagan mohan reddyఇటువంటి తరుణంలో 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయటం తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా తనకి ఫెవర్ గా మారిన తరుణంలో కరోనా వైరస్ వ్యాధి సమీక్ష సమావేశాలు సరిగ్గా నిర్వర్తించకుండా మీడియాతో కాంటాక్ట్ అవ్వకుండా వ్యవహరిస్తున్నట్లు బయట టాక్ చాలా గట్టిగా ఉంది. మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు లాక్ డౌన్ స్టెప్స్ తీసుకుంటూ క్వారంటైన్స్ వార్డులు ఏర్పాటు చేయడం, ఎప్పటికపుడు రివ్యూస్ చేయడం, మీడియాతో వాటిని పంచుకోవడం ద్వారా ప్రజలకు తాను చాలానే చేస్తున్నారనిపించుకుటున్నారు.

 

ఈ విధంగానే వైయస్ జగన్ మీడియాతో కాంటాక్ట్ అవుతూ ముందుకు వెళితే బాగుంటుందని, మైలేజ్ కోల్పోయే అవకాశం ఉండదని, ఈ వైరస్ రాష్ట్రంలో ఎక్కువ స్ప్రెడ్ అయితే…మీడియా జగన్ ని ఓ ఆట ఆటాడుకోవడం గ్యారెంటీ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Read more RELATED
Recommended to you

Latest news