ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేసే అధికారం అసెంబ్లీకి మాత్రమే ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. శాసన సభలో మండలి రద్దుపై చర్చలో భాగంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవాలా వద్దా అనేది మన ముందు ఉన్న ప్రశ్న అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలి అన్నారు.
కేవలం ఆరు రాష్ట్రాల్లోనే శాసన మండళ్ళు ఉన్నాయని అన్నారు. మన శాసన సభలోనే మేధావులు ఉన్నారని చెప్పిన ఆయన, మండలి కోసం ప్రజాధనం వినియోగించవద్దని ఆయన అభిప్రాయపడ్డారు. మండలి అవసరమే ఉంటే అన్ని రాష్ట్రాల్లో మండలిని కచ్చితంగా ఉంచే వారని అన్నారు. ప్రజల తీర్పుకి వ్యతిరేకంగా శాసన మండలి పని చేస్తుందని దాని అవసరం ఏముందని జగన్ ప్రశ్నించారు.
శాసన మండలి రద్దు అధికారం రాష్ట్ర అసెంబ్లీకే ఉందని రాజ్యాంగంలో చెప్పారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. మండలి చేసే సవరణలు పాటించాల్సిన అవసరం అసెంబ్లీకి లేదని అన్నారు. ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయడానికే మండలి ఉందని అన్నారు. రాజకీయ కోణంలో చేసే పనులకు ఇలాంటి సభలు మనకి అవసరమా అని జగన్ ప్రశ్నించారు. రాజకీయాలను మార్చడానికే అధికారంలోకి వచ్చామని అన్నారు.