ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నాంపెల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో చుక్కెదురు అయింది. కాగ 2014లో హుజూర్ నగర్ లో అనుమతి లేకుండా.. రోడ్ షో నిర్వహించారనే అభియోగంతో అప్పట్లో వైఎస్ జగన్ పై కేసు నమోదు అయింది. ఈ కేసును నేడు నాంపెల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు సోమవారం విచారించింది. ఈ కేసు విచారణలో భాగంగా.. వైఎస్ జగన్ కు ఇంకా.. సమన్లు ఇవ్వలేదని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
అయితే దీనిపై స్పందించిన కోర్టు.. ఈ నెల 31 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమన్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఈ కేసు లో రెండో నిందితుడిగా ఉన్న గున్నం నాగిరెడ్డి ఇటీవల కరోనాతో మరణించాడని కోర్టుకు తెలిపారు. కాగ నాగిరెడ్డి మరణ దృవీకరణ పత్రం ఇవ్వాలని ఆదేశించింది. అలాగే మూడో నిందితుడిగా ఉన్న గట్టు శ్రీకాంత్ రెడ్డి.. సోమ వారం కోర్టు కు హాజరు అయ్యాడు. ఆయనకు రూ. 5,000 వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. అలాగే ఈ కేసును వచ్చే నెల 31కి వాయిదా వేసింది.