ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసుల తగ్గుముఖం పట్టాయి. కరోనా తీవ్రత తగ్గింది. కేసులు కూడా తక్కువగా నమోదవుతున్నాయి. జనవరి నెలలో ఏకంగా వేలల్లో ఉన్న కేసులు ప్రస్తుతం వందల్లోనే నమోదవుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా థర్డ్ వేవ్ ముగిసింది. గడిచిన 24 గంటల్లో 18915 సాంపిళ్లను పరీక్షించగా.. 280 మందికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. కోవిడ్ వల్ల చిత్తూర్, నెల్లూర్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మరణించారు. గడిచిన 24 గంటల్లో 496 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
గడిచిన 24 గంటల్లో నమోదైన కేసులను పరిశీలిస్తే.. అనంతపూర్, ఈస్ట్ గోదావరి, ప్రకాశం, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 23,17,464 కరోనా కేసులు నమోదవ్వగా… 22,98,033 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 14722 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా కూడా.. కరోనా కేసుల సంఖ్య తక్కువగానే నమోదు అవుతున్నాయి. రానునన కాలంలో కేసుల సంఖ్య మరింత తగ్గే అవకాశ ఉంది.