ఏపీ కరోనా అప్డేట్ : 545 కేసులు, 10 మరణాలు

Join Our COmmunity

ఏపీలో కొద్ది రోజులుగా కరోనా కేసులు కాస్త భారీగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 545 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 862758కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో పది మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 6948కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13394 యాక్టివ్‌ కరోనా కేసులున్నాయి.

ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 842416 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే ఏపీలో 47,130 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 96,62,220 కరోనా పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే జిల్లాల వారీగా చూస్తే అనంతపురంలో 19, చిత్తూరు 32, తూర్పుగోదావరి జిల్లాలో 104, గుంటూరు 117, కడపలో 31, కృష్ణాలో 44, కర్నూలులో 10, నెల్లూరు 30, ప్రకాశంలో 25, శ్రీకాకుళంలో 19, విశాఖపట్నంలో 21, విజయనగరంలో 17, పశ్చిమ గోదావరిలో 76 కేసులు నమోదయ్యాయి.

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news