ఏపీలో కొద్ది రోజులుగా కరోనా కేసులు కాస్త భారీగానే నమోదవుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజుల నుండీ ఈ కేసులు ఎనిమిది వేలకి చేరువలో నమోదవుతున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,073 కరోనా కేసులు నమోదయ్యాయ్. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 661458కు పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో మరో 48 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 5606కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 67683 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.
నేడు కొత్తగా 8,695 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 588169 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రోజూ లానే ఈరోజు కూడా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వెయ్యికి చేరువగా కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో కూడా ఎనిమిది వందలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అలానే కృష్ణాలో 5, అనంతపూర్ 6, చిత్తూరు 8, ప్రకాశం 8, విశాఖపట్నం 3, తూర్పుగోదావరి 2, కర్నూలు 2, కడప 3, శ్రీకాకుళం 1, పశ్చిమ గోదావరి 5, గుంటూరు 2, నెల్లూరు ముగ్గురు కరోనా వల్ల మరణించారు.