ఎస్పీ బాలు కేవలం సింగర్ మాత్రమే కాదు. మంచి నటుడు కూడా. ఆయన దాదాపుగా 45 సినిమాల్లో నటించారు. అది కూడా ఏదో నటించామంటే నటించమని కాకుండా ఆ అన్ని సినిమాల్లో బాలు తన నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. కొన్ని సినిమాల్లో కథానాయకుడిగా, మరి కొన్నింటిలో సపోర్టింగ్ యాక్టర్ గా ఆయన నటించారు. 2012లో తనికెళ్ల భరణి దర్శకత్వం వహించిన మిథునం సినిమా మాత్రం బాలు నటనకు మంచి పేరు తెచ్చింది.
అంతే కాదు ఆయన నటనకు నంది పురస్కారమూ వరించింది. ఇక 1969లో పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే సినిమాలోఆయన మొదటిసారి నటుడిగా కనిపించారు. తమిళ ‘కేలడి కన్మణి’ అనే సినిమాలో హీరో పాత్ర పోషించారు. ఈ సినిమా తెలుగులో ఓ పాప లాలీ పేరుతో అనువాదం అయిందనుకోండి. ఇక పవిత్ర బంధం, దేవుళ్లు, దేవదాస్, మిథునం సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఆయన చివరిగా నటించిన సినిమా దేవదాస్. నాగార్జున – నానిలు హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాలో మెడిమెక్స్ హాస్పిటల్ చైర్మన్ సీతారామయ్య పాత్ర చేశారు. అయితే ఇది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు కేవలం అతిధి పాత్ర మాత్రమే.