ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి. ఇక నిన్న కాస్త పెరిగిన కరోనా కేసులు ఇవాళ ఒక్కసారిగా పడిపోయాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. ఏపీ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కొత్తగా 385 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,66, 450 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో మరో నలుగురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 373 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4355 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.
ఇక గడిచిన 24 గంటల్లో 675 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 47 , 722 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 39 , 848 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 95 , 18 , 787 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.